Online Fruad: ఆన్‌లైన్‌ మోసం.. ఒక్క రాంగ్‌ కాల్‌తో బ్యాంకు ఖాతాలో రూ.1.53 లక్షలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు

|

Jan 30, 2021 | 5:56 AM

Online Fruad: రోజురోజుకు ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లకు సమయం దొరికి చాలు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేసేస్తున్నారు. ఒక్క రాంగ్‌ఫోన్‌ కాల్‌..

Online Fruad: ఆన్‌లైన్‌ మోసం.. ఒక్క రాంగ్‌ కాల్‌తో బ్యాంకు ఖాతాలో రూ.1.53 లక్షలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు
Follow us on

Online Fruad: రోజురోజుకు ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లకు సమయం దొరికి చాలు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేసేస్తున్నారు. ఒక్క రాంగ్‌ఫోన్‌ కాల్‌ కారణంగా రూ.1.53 లక్షలు పోగొట్టుకున్న ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. కొనుగోలు చేసిన వస్తువులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు చెల్లించాలనుకున్న వారి ఖాతాలో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన కంచర్ల రాఘవ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ దుకాణంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులకు డబ్బు చెల్లించే సమయంలో అతడి భార్య నాగలక్ష్మీ ఫోన్‌లోని గూగుల్‌పేను ఉపయోగించాడు. కానీ ఆ డబ్బులు దుకాణం యజమాని ఖాతాలోకి వెళ్లలేదు.

కానీ ఆ డబ్బులు రెండు రోజులుగా ప్రాసెస్‌లో ఉండటంతో వారి కుమారుడు గూగుల్‌పే కస్టమర్‌కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, మరో నెంబర్‌కు కాల్‌ వెళ్లింది. ఈ క్రమంలో దీనిని ఆసరగా చేసుకున్న అవతలి వ్యక్తులు.. బాధితుల ఆధార్‌, బ్యాంకు ఖాతానెంబర్‌, ఓటీపీ తదితర వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో ఉన్న రూ.1.53 లక్షలు నాలుగు దఫాలుగా డ్రా చేసినట్లు రావడంతో బాధితులు షాక్‌కు గురయ్యాడు. తిరిగి ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా, కలవకపోవడంతో మోసపోయానని తెలుసుకుని వెంటనే కొత్తగూడెంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ఈ విషయమై పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి వ్యక్తులకు అయినా ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు వివరాలు, ఆధార్‌ నెంబర్‌, ఓటీపీలను చెప్పవద్దని సూచిస్తున్నారు. కొందరు మోసగాళ్లు అమాయకులను అసరా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు వాళ్లు కానీ, ఏ సంస్థలు అయినా ఓటీపీలు అడగరని, పొరపాటున బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పినట్లయితే మోసపోవాల్సిందేనని అన్నారు.

Also Read: Crime News: నకిలీ పత్రాలో కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యాడు..