AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు.. ఏకంగా అమ్మమ్మ గొలుసే కొట్టేసిన మనవడు

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాటిలో డబ్బులు పెట్టి అప్పుల బారిన పడి వాటిని కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు వాటిని తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఏకంగా అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసు కాజేసి కటకటాల పాలయ్యాడు.

Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు.. ఏకంగా అమ్మమ్మ గొలుసే కొట్టేసిన మనవడు
Online Betting Addiction
Anand T
|

Updated on: Nov 28, 2026 | 9:04 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఏకంగా తన అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసు కాజేశాడు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన ముష్ణం వెంకటేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే ఇతనికి పెళ్లి కూడా జరిగింది. దీంతో దంపతులు ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

అయితే వెంకటేష్‌ కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడటం స్టార్ట్ చేసి చాలా డబ్బులు కోల్పోయాడు. చివరకు భార్య నగలు కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్ ఆడాడు. పోయిన డబ్బులు మళ్లీ సంపాదించాలని అప్పులు చేసి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఇక చేసేదేమీ లేక సొంతూరికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. అయితే ఇంటికొచ్చాక మళ్లీ ఎలాగైనా బెట్టింగ్ ఆడి పోయిన డబ్బులు మొత్తం తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కొదురుపాకలో తన అమ్మమ్మ ఒంటరిగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు.

ఇక పథకం ప్రకారం ఈ నెల 18న బైక్‌పై కొదురుపాకకు వెళ్లి చడీచప్పుడు చేయకుండా ఇంట్లోకి దూరాడు. లైట్స్ ఆఫ్‌ చేసి అమ్మమ్మ నోరు మూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా, ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి దొంగిలించిన 10 గ్రాముల బంగారం, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us