వన్‌ప్లస్ యూజర్స్‌కు షాకింగ్ న్యూస్..డేటా అంతా చోరీ..

|

Nov 24, 2019 | 4:53 PM

వన్‌ప్లస్ సంస్థ తన కష్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఫోన్లకు సంబంధించిన డేటా అంతా చోరీకి గురైనట్లు స్పష్టం చేసింది. ఫోన్ నెంబర్లు, పేర్లు, అడ్రస్‌లు సహా మరికొన్ని సున్నితమైన వివరాలు కూడా చోరీకి గురవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాకపోతే పేమెంట్ ఇన్ఫర్మేషన్, పాస్‌వర్డ్స్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు సేఫ్‌గా ఉన్నట్లు సంస్థ తెలియజేయడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే వన్‌ప్లస్ సంస్థ అలర్టయ్యింది. హ్యాకర్స్‌ను ఆపడానికి, సెక్యురిటీని […]

వన్‌ప్లస్ యూజర్స్‌కు షాకింగ్ న్యూస్..డేటా అంతా చోరీ..
Follow us on

వన్‌ప్లస్ సంస్థ తన కష్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఫోన్లకు సంబంధించిన డేటా అంతా చోరీకి గురైనట్లు స్పష్టం చేసింది. ఫోన్ నెంబర్లు, పేర్లు, అడ్రస్‌లు సహా మరికొన్ని సున్నితమైన వివరాలు కూడా చోరీకి గురవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాకపోతే పేమెంట్ ఇన్ఫర్మేషన్, పాస్‌వర్డ్స్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు సేఫ్‌గా ఉన్నట్లు సంస్థ తెలియజేయడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే వన్‌ప్లస్ సంస్థ అలర్టయ్యింది. హ్యాకర్స్‌ను ఆపడానికి, సెక్యురిటీని బలోపేతం చేయడానికి  చర్యలు ప్రారంభించింది. ఈ విషయం బయటకు వెల్లడించడానికి ముందే..వినియోగదారులందరికి విషయాన్ని ఈ మెయిల్ ద్వారా చేరవేసినట్టు వన్‌ప్లస్ తెలిపింది. 

డేటా చోరీ ఫలితంగా యూజర్స్ అందరికి స్పామ్ మెయిల్స్ మాత్రమే వస్తాయని, అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేనట్టు సమాచారం.  అయితే వినియోగదారుడి వ్యక్తిగత సమాచారంతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి..వాటిని అనైతిక కార్యకలాపాలకు వాడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా పాత పాస్ వర్డ్స్ స్థానంలో..అత్యంత బలమైన పాస్ వర్డ్స్ మార్చితే బెటర్ అని వారు సూచిస్తున్నారు. కాగా వన్‌ప్లస్ వినియోగదారుల డేటా చోరీ ఇది మొదటిసారి మాత్రమే కాదు. 2018 జనవరిలో దాదాపు 40,000 మంది యూజర్స్ నుంచి క్రెడిట్ కార్డ్స్‌కు సంబంధించిన డేటా చోరీ అయ్యింది. సంస్థను విస్తరించినంత వేగంగా..యూజర్స్ భద్రతను కూడా కాపాడటం అంతే అవసరం.