Andhra Students : కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు అందజేస్తుంది ఏపీ ప్రభుత్వం. మార్చి 19 నుంచి ఆగస్టు 31 మధ్య సమయానికి సంబంధించిన సరకులను 4 దశల్లో ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మార్చి 19 నుంచి ఏప్రిల్ 23 వరకు సరకులను పంపిణీ చేశారు. కాగా ఈ ఒక్క నెలలోనే ఒక్కో స్టూడెంట్‌కు 90 కోడిగుడ్ల చొప్పున అందనున్నాయి.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉన్న 40 వర్కింగ్ డేస్‌కు ఇవ్వాల్సిన 34 గుడ్లను 17 చొప్పున రెండుసార్లు అందించాలని నిర్ణయించారు. చాలా స్కూళ్లకు ఈ సమయంలో గుడ్లు పంపిణీ జరగలేదు. వీటిని స్టూడెంట్స్‌కు ఇవ్వకుండానే తాజాగా జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు 62 వర్కింగ్ డేస్‌కు మరో 56 గుడ్లు అందించాలని ఆదేశించారు. ఈ రెండు దశలకు చెందిన మొత్తం 90 గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు. పల్లీ చిక్కీలు కూడా ఇదే విధంగా సరఫరా అవ్వనున్నాయి. మూడు, నాలుగు విడతలవీ కలిపి ఒక్కో స్టూడెంట్‌కు 56 వరకు రానున్నాయి. ఇప్పటికే సరుకుల పంపిణీని కొన్ని చోట్ల మొదలుపెట్టారు. సరకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరే ఉంటున్న విద్యార్థులకు పోషకాహారం అందుతుంది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు