
Corona cases in the world: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 45 లక్షలు, మృతుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికా, యూకే, బ్రెజిల్ దేశాల్లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఆ దేశాల్లో వైరస్ వ్యా్ప్తి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికాలో నిన్న ఒక్క రోజే 26,398 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో 13,944 కేసులు, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి.
Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
రానురాను భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారత్ లో గడచిన 24 గంటల్లో 3942 కేసులు నమోదయ్యాయి. మరణాల్లోనూ కూడా అగ్రరాజ్యం మొదటిస్థానంలో(86,900) ఉంది. అక్కడ నిన్న 1,703 మంది చనిపోగా, బ్రెజిల్‌లో 835, యూకేలో 428, ఇటలీలో 262, ఫ్రాన్స్‌లో 351, మెక్సికోలో 294, కెనడాలో 170 మంది కరోనా సోకి మరణించారు.