Breaking : కేరళ గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్​..

|

Jun 05, 2020 | 11:44 AM

కేర‌ళ‌లో ఏనుగు విషాద మ‌ర‌ణం దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఏనుగు మృతికి కార‌కులైన వారిని వెంట‌నే ప‌ట్టుకోని క‌ఠిన శిక్ష‌లు వేయాలంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియ‌స్ గా తీసుకుని విచార‌ణ జ‌రుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఈ విష‌యాన్ని కేరళ అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. One accused arrested, in connection with […]

Breaking : కేరళ గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్​..
Follow us on

కేర‌ళ‌లో ఏనుగు విషాద మ‌ర‌ణం దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఏనుగు మృతికి కార‌కులైన వారిని వెంట‌నే ప‌ట్టుకోని క‌ఠిన శిక్ష‌లు వేయాలంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియ‌స్ గా తీసుకుని విచార‌ణ జ‌రుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఈ విష‌యాన్ని కేరళ అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు.

తాజాగా చ‌నిపోయిన‌ ఏనుగు ప్రైమ‌రీ పోస్టుమార్టం రిపోర్టు‌ బయటకు వచ్చింది. పేలుడు పదార్థాలు కలిగిన పైనాపిల్‌ తినడం వల్లే ఏనుగు నోటిలో గాయాలయ్యాయని తేలింది. అది తీవ్ర‌మైన‌ నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఆకలితో బాధ‌ను అనుభ‌వించింద‌ని నివేదికలో వెల్ల‌డించారు. “నొప్పి నుంచి రిలీప్ కోసం ఒకరోజు మొత్తం నదిలో ఉండి, చివరకు నీరసించి అక్కడే నీటిలో పడి పోయింది. ఊపిరి తిత్తులు ప‌నిచెయ్య‌క‌పోవ‌డమే ఏనుగు మృతికి కారణం” అని పోస్టుమార్టం చేసిన డాక్ట‌ర్లు తెలిపారు.