దుబ్బాకలో 11 మంది స్వతంత్రుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

|

Nov 10, 2020 | 5:55 PM

చివరి వరకు ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌటింగ్.. నోటాకు 552 మంది ఓటేశారు.

దుబ్బాకలో 11 మంది స్వతంత్రుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
Follow us on

చివరి వరకు ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌటింగ్.. చివరాఖరుకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే, పోలైన ఓట్ల పరిశీలిస్తే.. నోటాకు 552 మంది ఓటేశారు. పోటీ చేసిన 11 మంది కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పడగా, 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదిలావుంటే, ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికార పార్టీ అభ్యర్థిని సోలిపేట సుజాతపై 1,118 ఓట్లతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీతో దోబూచులాడిన విజయం చివరకు రఘునందన్‌ను వరించింది.