నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. సభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇప్పటికే ప్రధాన పార్టీలు, వివిధ సంస్ధలు, సినీ నటులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యురేనియం తవ్వకాల ప్రతిపాదనల్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కేంద్రానికి విఙ్ఞప్తి చేసింది. ప్రజల నిర్ణయంతోనే తమ ప్రభుత్వం ఏకీభవిస్తుందని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు.