దాదా.. గ్రేట్ కెప్టెన్: అక్తర్

Ganguly Not only a tough opposition but a great captain: ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో మెదిలే పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తను ఎదుర్కున్న ప్రత్యర్థుల్లో సౌరవ్ గంగూలీ అత్యంత కఠినమని.. అంతేకాకుండా అతడు ఓ గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. సోషల్ మీడియా వేదికగా అక్తర్.. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు  చేశాడు. […]

దాదా.. గ్రేట్ కెప్టెన్: అక్తర్
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2020 | 10:03 PM

Ganguly Not only a tough opposition but a great captain: ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో మెదిలే పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తను ఎదుర్కున్న ప్రత్యర్థుల్లో సౌరవ్ గంగూలీ అత్యంత కఠినమని.. అంతేకాకుండా అతడు ఓ గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు.

సోషల్ మీడియా వేదికగా అక్తర్.. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు  చేశాడు. ”నాకు ప్రత్యర్ధులపై ఆధిపత్యం చలాయించడం ఇష్టం. నేను ఆడే రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్దుల్లో గంగూలీ ఒకరు. అతడు బలమైన ప్రత్యర్దే కాదు. గొప్ప కెప్టెన్ కూడా. ఐపీఎల్‌లో అతడి కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాను”. అని గుర్తించుకుంటూ దాదాతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

https://www.instagram.com/p/CDrbMewMQp8/?utm_source=ig_web_copy_link