ధోని, కోహ్లీ కాదు.. దాదానే ఎక్కువగా మద్దతు ఇచ్చాడు..

Indian Cricket Team: మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి కంటే టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీనే తన కెరీర్ లో అండగా నిలిచి పూర్తి మద్దతు ఇచ్చాడని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ‘సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడినప్పుడు తనకు ఎంతో మద్దతు లభించిందని.. ఆ సమయంలో తన కెరీర్ లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని యువరాజ్ తెలిపాడు. దాదా నుంచి లభించిన మద్దతు తనకు ధోని, కోహ్లీల […]

ధోని, కోహ్లీ కాదు.. దాదానే ఎక్కువగా మద్దతు ఇచ్చాడు..
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:16 PM

Indian Cricket Team: మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి కంటే టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీనే తన కెరీర్ లో అండగా నిలిచి పూర్తి మద్దతు ఇచ్చాడని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ‘సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడినప్పుడు తనకు ఎంతో మద్దతు లభించిందని.. ఆ సమయంలో తన కెరీర్ లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని యువరాజ్ తెలిపాడు. దాదా నుంచి లభించిన మద్దతు తనకు ధోని, కోహ్లీల నుంచి లభించలేదని యువీ వెల్లడించాడు.

మరోవైపు శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్, ఆసీస్ పేసర్ మెక్ గ్రాత్ బౌలింగ్ లలో చాలా ఇబ్బంది పడ్డానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. అయితే సచిన్ సలహా మేరకు స్వీప్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంతో మురళీధరన్ బౌలింగ్ లో మెరుగ్గా ఎదుర్కున్నానని తెలిపాడు.

ఇక కరోనా వైరస్ గురించి ప్రస్తావించి యువీ.. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేసిందని అన్నాడు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భయపడకుండా దానిపై పూర్తిగా తెలుసుకోవాలని సూచించాడు.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..