నగరంలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు? ఎందుకు?

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2019 | 9:15 PM

హైదరాబాద్‌లో సోమవారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెల్లడించారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. 23వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్టు అధికారులు వెల్లడించారు. అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు : […]

నగరంలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు?  ఎందుకు?
Follow us on

హైదరాబాద్‌లో సోమవారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెల్లడించారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. 23వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్టు అధికారులు వెల్లడించారు.

అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు :

సాహెబ్ నగర్, ఆటో నగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ, బుద్వేల్, సులేర్ణన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్ పేట్, ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగ్, బోడుప్పల్, చెంగిచర్ల, పిర్జాదిగూడ, సైనిక్ పురి, మైలాలి, లాలాపేట్, స్నేహాపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు.