ఏపీలో బార్లు తెరిచేందుకు నో చెప్పిన ప్ర‌భుత్వం..కానీ…

|

Jun 09, 2020 | 11:05 PM

కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో లాక్​డౌన్ విధించడంతో అంతా ష‌ట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ప్ర‌భుత్వం తాజాగా స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతో ఇప్పుడిప్ప‌డే అన్ లాక్ మోడ్ లోకి వెళ్తున్నాయి వివిధ రంగాలు. అయితే ఏపీలో బార్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు.

ఏపీలో బార్లు తెరిచేందుకు నో చెప్పిన ప్ర‌భుత్వం..కానీ...
Follow us on

కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో లాక్​డౌన్ విధించడంతో అంతా ష‌ట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ప్ర‌భుత్వం తాజాగా స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతో ఇప్పుడిప్ప‌డే అన్ లాక్ మోడ్ లోకి వెళ్తున్నాయి వివిధ రంగాలు. అయితే ఏపీలో బార్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. బార్లలో… మద్యం, బీర్ల విక్రయాలకు అనుమతి లేదని తేల్చి చెప్పేసింది. అయితే వ్యాపారులు నష్ట‌పోకుండా బార్లు, రెస్టారెంట్లలోని మద్యం, బీర్ బాటిల్స్ ను ప్రభుత్వ అవుట్ లెట్​లకు తరలించి అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. అయితే లూజ్ కాకుండా కేవలం సీల్డ్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని ఆదేశాల్లో వివ‌రించింది.

లాక్​డౌన్ కారణంగా చాలారోజులపాటు బార్లు​ మూసివేయడంతో.. బీర్ల ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయే అవకాశం ఉందని వాటిని యధావిధిగా విక్రయించుకునే అనుమ‌తులు ఇవ్వాల‌ని ఏపీ వైన్ డీలర్స్ అసోసియేషన్ కోరింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఔట్ లెట్ల ద్వారా మాత్రమే బార్లు.. తమ వ‌ద్ద‌ నిల్వ ఉన్న మద్యం, బీరు బాటిళ్లను అమ్ముకోవాల‌ని పేర్కొంది. ద‌గ్గ‌ర్లోని గ‌వ‌ర్న‌మెంట్ ఔట్​లెట్లకు తరలించి విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మద్యం, బీర్ల విక్రయాలపై హోల్​సేల్ ధర మాత్రమే బార్ ఓన‌ర్ల‌కు చెల్లిస్తారని స్పష్టం చేసింది.