ఎన్ఎంసీ బిల్లుపై అపోహలు వద్దు: జీవీఎల్

వైద్య చరిత్రలో ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈసారి జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మరోవైపు ఏపీలో వైసీపీ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు […]

ఎన్ఎంసీ బిల్లుపై అపోహలు వద్దు: జీవీఎల్

Edited By:

Updated on: Oct 18, 2020 | 9:07 PM

వైద్య చరిత్రలో ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఈసారి జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మరోవైపు ఏపీలో వైసీపీ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు జీవీఎల్.