నాన్న కోసం.. ఎన్నికల ప్రచారం.!

|

Apr 03, 2019 | 9:47 PM

నరసాపురం: జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరికి అండగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తండ్రి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేము లోకల్. మాదీ ఇదే ఊరు. నాన్నను గెలిపించండి, బాబాయి పార్టీని గెలిపించండి… రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఓటర్లకు నిహారిక పిలుపునిచ్చింది. మా […]

నాన్న కోసం.. ఎన్నికల ప్రచారం.!
Follow us on

నరసాపురం: జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరికి అండగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తండ్రి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మేము లోకల్. మాదీ ఇదే ఊరు. నాన్నను గెలిపించండి, బాబాయి పార్టీని గెలిపించండి… రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఓటర్లకు నిహారిక పిలుపునిచ్చింది. మా బాబాయి పవన్ కళ్యాణ్ చక్కటి ఆశయాలతో పార్టీ పెట్టారని జనసేన ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నిహారిక చెప్పడం విశేషం. నాన్న ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారని నాకు నమ్మకం ఉందని ఆమె అన్నారు.

నిహారిక ఇలా ప్రచారంలో పాల్గొనడంతో మెగా అభిమానులలో కొత్త జోష్ వచ్చిందని చెప్పాలి. ఎన్నికలకు 8 రోజులు ఉన్న తరుణంలో వీరిద్దరికి అండగా మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెంతమంది వస్తారో వేచి చూడాల్సిందే.