ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రమాణం

| Edited By: Anil kumar poka

Nov 06, 2020 | 12:24 PM

న్యూజిలాండ్‌ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రమాణస్వీకారం చేశారు.. జెసిండా ప్రధాని పదవిని చేపట్టడం ఇది రెండోసారి..అక్టోబర్‌ 17న జరిగిన ఎన్నికలలో జెసిండా ఆర్డెర్న్‌ సారథ్యంలోని లేబర్‌పార్టీ ఘన విజయం సాధించింది..

ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రమాణం
Follow us on

న్యూజిలాండ్‌ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రమాణస్వీకారం చేశారు.. జెసిండా ప్రధాని పదవిని చేపట్టడం ఇది రెండోసారి..అక్టోబర్‌ 17న జరిగిన ఎన్నికలలో జెసిండా ఆర్డెర్న్‌ సారథ్యంలోని లేబర్‌పార్టీ ఘన విజయం సాధించింది.. నిజానికి రెండో ప్రపంచయుద్ధం తర్వాత లేబర్‌పార్టీ ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఇదే ప్రథమం.. ఇంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన జెసిండా ఇప్పుడు పూర్తి మెజారిటీతో సొంతంగా అధికారంలోకి వచ్చారు.. వెల్లింగ్‌టన్‌ అధికార గృహంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి జెసిండాతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేశారు.. దేశం ఎలాంటి సంక్షోభస్థితిని ఎదుర్కొన్నా నిబద్దతతో, నిజాయితీతో పని చేస్తామని అన్నారు జెసిండా.. ప్రపంచదేశాలన్నీ కరోనాతో అల్లకల్లోలం అవుతున్నప్పుడు కరోనా వైరస్‌ను కట్టడి చేసి ప్రశంసలు అందుకున్నారు జెసిండా ఆర్డెర్న్‌..