మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్లు…

|

Dec 31, 2019 | 1:53 PM

2019కి బైబై చెబుతూ.. 2020ను ఘనంగా స్వాగతం పలకడానికి నగరవాసులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు పసందైన ఆఫర్లతో ఆకర్షిస్తుండగా.. మందుప్రియుల కోసం ప్రత్యేకమైన తాయిలాలను కూడా సిద్ధం చేశాయి. న్యూ ఇయర్ పార్టీ అంటేనే చిల్డ్ బీరు, మందు, వొడ్కాతో కూల్ డాన్సులతో రచ్చ చేస్తూ 2019 చేదు జ్ఞాపకాలకు బైబై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పడం… దీనికి అనుగుణంగానే మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో […]

మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్లు...
Follow us on

2019కి బైబై చెబుతూ.. 2020ను ఘనంగా స్వాగతం పలకడానికి నగరవాసులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు పసందైన ఆఫర్లతో ఆకర్షిస్తుండగా.. మందుప్రియుల కోసం ప్రత్యేకమైన తాయిలాలను కూడా సిద్ధం చేశాయి. న్యూ ఇయర్ పార్టీ అంటేనే చిల్డ్ బీరు, మందు, వొడ్కాతో కూల్ డాన్సులతో రచ్చ చేస్తూ 2019 చేదు జ్ఞాపకాలకు బైబై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పడం… దీనికి అనుగుణంగానే మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఇప్పటికే హైదరాబాద్ మెట్రో మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మందు తాగిన వారు కూడా ప్రయాణించవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఇతరులకు మాత్రం ఇబ్బందులు కలిగించకూడదని తెలిపింది. అంతేకాకుండా ఎంఎంటీఎస్ రైళ్లు కూడా అర్ధరాత్రి 1.30 వరకు నడవనున్నాయని అధికారులు ప్రకటించారు. అర్ధరాత్రి దాటాక 1.15కి లింగంపల్లి-హైదరాబాద్‌కు.. 1.30 గంటలకు లింగంపల్లి-ఫలక్‌నుమా ఆఖరి ట్రైన్లు నడవనున్నాయి.

ఇదిలా ఉంటే కొంతమంది పబ్ నిర్వాహకులు ఏకంగా మందుబాబులను ఇంటికి తీసుకెళ్లి దింపుతామని ప్రకటించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బంది లేకుండా తాగి ఇంటికి వెళ్లలేని మందుబాబులను.. క్షేమంగా వారి ఇంటి దగ్గర దిగబెడతామని ఇందుకోసం ఎక్స్‌ట్రా ఛార్జీ ముందుగానే చెల్లించాలని కండీషన్ పెడుతున్నారు.