New Year Celebrations Around World: అందరూ కొత్తేడాదికి వెల్‌కమ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ అందరి జీవితాల్లో కోటి వెలుగులు నింపాలని కోరుకుంటూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో ఒకేసారి కొత్త సంవత్సరం ప్రారంభంకాదనే విషయం మనందరికీ తెలిసిందే. దీనికి కారణం ఒక్కో దేశంలో ఒక్కో కాలమానం ఉండడమే. సూర్యుడు పరిభ్రమించే సమయం ఆధారంగా ఈ సమయాల్లో మార్పులు వస్తుంటాయి. దీంతో మొత్తం 26 గంటల్లో ప్రపంచంలో ఏదో ఒక దేశం కొత్తేడాదిలో అడుగుపెడుతూనే ఉంటుంది. మరి ప్రపంచంలో మొదటగా కొత్తేడాదిని ఆస్వాదించే ప్రాంతం, చివరిగా వెల్‌కమ్ చెప్పే ప్రాంతాలేంటో తెలుసుకుందామా…
ప్రపంచంలో కొత్తేడాదిని తొలిగా ఫసిఫిక్ ఐలాండ్‌లోని టోంగా దేశంలో జరుపుకుంటారు. భారతదేశ కాలమానం ప్రకారం డిసెంబర్ 31 ఉదయం 3.30 గంటలకు వీరు కొత్తేడాదిలోకి అడుగుపెడతారు.
ఇక ప్రపచంలో అందరికంటే ఆలస్యంగా జనవరి1 రాత్రి 5.30 గంటలకు అమెరికా దీవులైన బేకర్, హౌలాండ్ దీవుల్లో జరుపుకుంటారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దగా జనావాసం ఉండదు.. కాబట్టి హౌలాండ్ కంటే ముందు సమోవాలో కొత్తేడాదిలోకి ప్రవేశిస్తారు.
డిసెంబర్ 31 (భారత సమయం ప్రకారం)
ఉదయం 3.30 గంటలకు – సమోవా, క్రిస్టమస్ ఐలాండ్/కీరిబతి
ఉదయం 3.45 గంటలకు – న్యూజిలాండ్
మధ్యాహ్నం 6.3 గంటలకు – ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలు
మధ్యాహ్నం 8.5 గంటలకు – జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా
సాయంత్రం 9.30 గంటలకు – చైనా, పిలిప్పీన్స్, సింగపూర్
సా. 4.00 గంటలకు – థాయ్ లాండ్, కంబోడియా, ఇండోనేషియా చాలా ప్రాంతాలు
రాత్రి11.30 గంటలకు – బంగ్లాదేశ్
రాత్రి 11.45 గంటలకు – నేపాల్
రాత్రి 12.00 గంటలకు – భారత్, శ్రీలంక
రాత్రి 12.30 గంటలకు – పాకిస్తాన్
రాత్రి 1.30 గంటలకు – అజర్ బైజాన్
రాత్రి 2.00 గంటలకు – లకు ఇరాన్
రాత్రి 2.30 గంటలకు – టర్కీ, ఇరాక్, కెన్యా, రష్యా లోని చాలా ప్రాంతాలు
ఉదయం 3.30 గంటలకు – గ్రీస్, రొమెనియా, దక్షిణాఫ్రికా, హంగరీ, ఇతర మధ్య, తూర్పు యూరోప్ పట్టణాలు
ఉదయం 4.30 గంటలకు – జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, అల్జీరియా, బెల్జియం, స్పెయిన్
ఉదయం 5.30 గంటలకు – యూకే, ఐర్లాండ్ ఘనా, ఐస్ లాండ్ పోర్చుగల్