Traffic Restrictions : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..హైాదరాబాద్‌‌లో ట్రాఫిక్ రూల్స్ ఇక్కడే..

కరోనా కారణంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా... ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ సంబరాలకు సిద్ధమౌతున్నారు.

Traffic Restrictions : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..హైాదరాబాద్‌‌లో ట్రాఫిక్ రూల్స్ ఇక్కడే..

Updated on: Dec 31, 2020 | 2:40 PM

కరోనా కారణంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ సంబరాలకు సిద్ధమౌతున్నారు. అయితే సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల‌ పరిధిలో సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్స్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మూసివేశారు. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు. ఇటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్క్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు స్పష్టం చేశారు.