
Tamil Actress VJ Chithra: తమిళ నటి చిత్ర ఆత్మహత్య కేసు విచారణలో సరికొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పాండియన్ స్టోర్స్ అనే సీరియల్‌లో చిత్ర ముద్దు సీన్‌లో నటించడం వల్లే భర్త హేమంత్ వేధింపులకు పాల్పడ్డాడని.. వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.
సదరు సీరియల్‌లో ముద్దు సీన్‌కు చిత్ర అంగీకరించడం.. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి భర్త హేమంత్ వీక్షించడం జరిగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య హోటల్‌లో వాగ్వాదం జరిగింది. పాత్రలో భాగంగా రొమాన్స్ సీన్లలో నటించాను తప్పితే.. వేరే ఉద్దేశం లేదని చిత్ర చెబుతున్నా.. ఆమె భర్త హేమంత్ వినిపించుకోలేదు. చిత్ర క్యారెక్టర్‌పై నిందలు వేశాడు. దీనితో తన భర్త వేసిన నిందను తట్టుకోలేక చిత్ర ఉరి వేసుకుంది. తాజాగా ఈ కేసుపై శ్రీపెరుంబుదూరు ఆర్డీవో కార్యాలయంలో జరిపిన విచారణలో చిత్ర భర్త హేమంత్ నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పాండియన్ స్టోర్స్ సీరియల్ తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో డబ్ అయిన సంగతి విదితమే.
Also Read:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..