KCR New Scheme: కేసీఆర్‌పేరుతో కొత్త స్కీమ్

|

Feb 27, 2020 | 6:45 PM

తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం జరిగింది. యువతకు ఉపాధి కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ కొత్త స్కీమ్‌ను ప్రారంభించనున్నది. త్వరలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

KCR New Scheme: కేసీఆర్‌పేరుతో కొత్త స్కీమ్
Follow us on

Telangana govt is to introduce new schme named after CM KCR: తెలంగాణలో మరో పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేరు ఖరారు చేశారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ పథకం త్వరలోనే లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను శరవేగంగా అమలు చేస్తున్న తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు.. అదే పంథాని వచ్చే నాలుగేళ్ళు కొనసాగించేలా పథకాలను రూపొందిస్తున్నారు. ఈ దిశగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఉద్దేశంతో తన పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.

కేసీఆర్ ఆపద్బంధు పథకం కింద ఐదుగురు ఎంబీసీ యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించనున్న బీసీ సంక్షేమ శాఖ…ఆతర్వాత పెద్ద ఎత్తున విస్తరించాలని భావిస్తోంది. పదివేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే పూర్తి విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారాయన.