ఏపీ వ్యవసాయరంగంలో పెను మార్పులు: జగన్ డెసిషన్ ఇదే

|

Feb 10, 2020 | 1:42 PM

ఏపీలో వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విప్లవాత్మక మార్పుల దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాలతో వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు పూర్తి సాంకేతిక పరిఙ్ఞానం అందనున్నది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో పలు అగ్రిమెంట్లపై అధికారులు సంతకాలు చేశారు. చెన్నైలోని ఎంఎస్‌ […]

ఏపీ వ్యవసాయరంగంలో పెను మార్పులు: జగన్ డెసిషన్ ఇదే
Follow us on

ఏపీలో వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విప్లవాత్మక మార్పుల దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాలతో వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు పూర్తి సాంకేతిక పరిఙ్ఞానం అందనున్నది.

ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో పలు అగ్రిమెంట్లపై అధికారులు సంతకాలు చేశారు. చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్, న్యూఢిల్లీలోని సాయిల్‌ సైన్స్‌ డివిజన్, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, ఫరీదాబాద్‌లోని సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్‌ మరియు శిక్షణ సంస్థ, వారణాసిలోని నేషనల్‌ సీడ్‌ రీసెర్చ్‌ మరియు శిక్షణ సంస్థ, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్, కర్నాల్‌లోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ , ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, బెంగుళూరుకు చెందిన సదరన్‌ రీజినల్‌ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌ మరియు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్‌ – సీఐఎఫ్‌ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం తాజాగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.

ఈ సంస్థలు అందించే సాంకేతిక, సమాచార పరిఙ్ఞానంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వామినాథన్ సిఫారసులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.