‘అబ్బే ! మేం ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు’, చైనా

లడాఖ్ సరిహద్దుల్లో తాము ఒక్క అంగుళం భూమినైనా ఆక్రమించలేదని చైనా చెబుతోంది. అసలు భారత దళాలే చొ చ్ఛు కు వచ్చాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ తెలిపారు. ఆసలు తాము..

అబ్బే ! మేం ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు, చైనా

Edited By:

Updated on: Sep 01, 2020 | 5:17 PM

లడాఖ్ సరిహద్దుల్లో తాము ఒక్క అంగుళం భూమినైనా ఆక్రమించలేదని చైనా చెబుతోంది. అసలు భారత దళాలే చొ చ్ఛు కు వచ్చాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ తెలిపారు. ఆసలు తాము   యుధ్దానికి కవ్వించలేదని, పరాయి దేశ భూభాగంలో ఒక ఇంచ్ భాగాన్నయినా ఆక్రమించలేదని చున్ చెప్పారు. మావాళ్లు క్రాస్ చేయనే లేదు. బహుశా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిఉండవచ్ఛు.. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు కృషి చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు. గత నెల 31 న భారత దళాలు ముందుకు చొరబడ్డాయని . లోగడ కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఉద్రిక్తతల నివారణకు ఉభయదేశాలూ కృషి చేయాలన్నారు.