AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు హెచ్చరిక: బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!

మనం రోజంతా పడిన అలసటను మరచిపోయి ప్రశాంతంగా నిద్రించే ప్రదేశం బెడ్‌రూమ్. నిద్ర మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యామో.. బెడ్‌రూమ్‌లోని వాస్తు కూడా అంతే ముఖ్యం. చాలామంది స్థలం తక్కువగా ఉందనో లేదా ఇల్లు సదురుకోవడానికనో మంచం కింద ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల వస్తువులను దాచిపెడుతుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల తీవ్రమైన ప్రతికూల శక్తులు ప్రసరించి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు హెచ్చరిక: బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!
Vastu Tips For Bedroom
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2026 | 1:45 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇంటీరియర్ డిజైన్‌తో పాటు బెడ్‌రూమ్ అమరికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది స్థలం ఆదా చేయడం కోసం మంచం కింద పాత వస్తువులు, పగిలిన సామాన్లు, ఇనుప పాత్రలు, బూట్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను దాచి ఉంచుతుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, దంపతుల మధ్య కలహాలు, ఆర్థిక నష్టాలు తలెత్తుతాయి. మంచి నిద్ర, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలగాలంటే మంచం కింద భాగాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం..

మంచం కింద ఉంచకూడని వస్తువులు – వాటి ప్రభావాలు:

విరిగిన లేదా పగిలిన వస్తువులు:

చాలామంది విరిగిపోయిన ఫర్నిచర్, పగిలిన అద్దాలు లేదా గాజు సామాన్లను మంచం కింద పెడుతుంటారు. వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు వాస్తు దోషాలను పెంచి, ఇంట్లో నిరంతరం మానసిక అశాంతిని, లక్ష్మీదేవి ఆగ్రహాన్ని కలిగిస్తాయి.

ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత వైర్లు:

పనిచేయని పాత రేడియోలు, ల్యాప్‌టాప్‌లు, ఛార్జర్‌లు లేదా ఐరన్ పెట్టెలను మంచం కింద ఉంచడం వల్ల రాహు దోషాలు పెరుగుతాయి. ఇవి ప్రతికూల తరంగాలను వెదజల్లడం ద్వారా రాత్రి వేళల్లో సరిగా నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం వంటి సమస్యలకు దారితీస్తాయి.

ఇవి కూడా చదవండి

పాత బూట్లు, చెప్పులు:

బూట్లు, చెప్పులలో బయటి దుమ్ము, ధూళితో పాటు ప్రతికూల శక్తులు ఉంటాయి. వీటిని మంచం కింద ఉంచడం వల్ల ఇంట్లోకి దరిద్రం వస్తుంది. ఇది వ్యక్తిగత ఆరోగ్యానికి, ఇంట్లోని ఆర్థిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది.

ఇనుప సామగ్రి, పదునైన వస్తువులు:

కత్తులు, కత్తెరలు లేదా తుప్పు పట్టిన ఇనుప వస్తువులను మంచం కింద ఉంచడం వల్ల దంపతుల మధ్య నిరంతరం గొడవలు, విభేదాలు వస్తాయి. ఇవి దాంపత్య జీవితంలోని ప్రశాంతతను దెబ్బతీస్తాయి.

పాత దుస్తులు, పొడి చెత్త:

వాడని పాత బట్టలను మూటగట్టి మంచం కింద ఉంచడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉండదు. దీనివల్ల నిరంతరం అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి.

చేయాల్సిన నివారణలు:

మంచం కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు ఊడ్చి, శుభ్రంగా ఉంచుకోవాలి. మంచం కింద గాలి ప్రసరణ సరిగా జరిగేలా చూసుకోవాలి. వీలైతే మంచం కింద ఏ వస్తువులూ లేకుండా ఖాళీగా ఉంచడమే అత్యంత శ్రేయస్కరం. ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో శాంతి, సౌఖ్యాలు విలసిల్లుతాయి. కాబట్టి, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి, మీ బెడ్‌రూమ్‌లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల వాతావరణాన్ని, ప్రశాంతమైన నిద్రను పొందండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడమెలా
సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడమెలా
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి..
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి..
బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!
బెడ్‌రూమ్‌లో మంచం కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి!
టాక్సిక్‌ క్రేజ్‌... ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!
టాక్సిక్‌ క్రేజ్‌... ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!
ఇది కదా అద్భుతం అంటే.. తండ్రి మాటలకు కడుపులోనే చిరునవ్వులు..
ఇది కదా అద్భుతం అంటే.. తండ్రి మాటలకు కడుపులోనే చిరునవ్వులు..
పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఈ ఆకులను తెచ్చుకుని ఓ పట్టు పడతారు
పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఈ ఆకులను తెచ్చుకుని ఓ పట్టు పడతారు
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌
పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌
పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో
పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో