నెట్‌ఫ్లిక్స్‌ నయా ఆఫర్.. 48 గంటలు ఉచితం

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియన్ యూజర్స్ కోసం క్రేజీ ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించనున్నారట.

నెట్‌ఫ్లిక్స్‌ నయా ఆఫర్.. 48 గంటలు ఉచితం

Updated on: Oct 22, 2020 | 11:37 AM

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియన్ యూజర్స్ కోసం క్రేజీ ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించనున్నారట. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త యూజర్స్‌ను ఆకర్షించడంలో భాగంగా ‘స్ట్రీమ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని మొదట భారత్‌లోనే ప్రవేశపెడుతున్నారట. అందులో భాగంగా డిసెంబరు 4 నుంచి 48 గంటల ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ తీసుకొస్తున్నారు. గతంలో సబ్‌స్క్రిప్షన్ చెయ్యకుండానే వినియోగదారులు నెల పాటు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలు పొందే అవకాశం ఉండేది. ఇటీవల ఈ వెసులుబాటును కొన్ని దేశాల్లో తొలగించారు. ఇప్పుడు ఆ అఫర్ స్థానంలో ఈ 48 గంటల ఆఫర్‌ తీసుకొస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అఫిషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ గత నెలలో నెల రోజుల ఉచిత సేవల ఆఫర్‌ని అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇండియాలో మాత్రం ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉంది. భారత్‌లోనూ నెలరోజుల ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి ఆ స్థానంలో ఈ 48 గంటల ఉచిత సేవలను తీసుకొచ్చే అవకాశం ఉంది.

Also Read : దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు