Rhea’s drug probe: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోని డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, స్టాఫ్ దిపేష్ సావంత్, డ్రగ్ డీలర్ కైజన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కేసులో గత రెండు రోజులుగా ప్రముఖ సెలబ్రిటీస్ సారా అలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లు వినిపిస్తున్నాయి. విచారణలో భాగంగా రియా చక్రవర్తి బీ-టౌన్‌కు చెందిన మొత్తం 25 మంది పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తుండగా.. అందులో దర్శకులు, కాస్టింగ్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థల అధినేతలు, నటీనటులు ఉన్నట్లు టాక్. అంతేకాదు సారా, సిమోన్ పేర్లను రియానే ఎన్సీబీ అధికారులకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రియా స్టేట్‌మెంట్‌లో ఏ బాలీవుడ్ స్టార్ పేరు వెల్లడించలేదని.. కేవలం డ్రగ్స్ పెడ్లర్లు, స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసులో 25 మంది బాలీవుడ్ స్టార్లు పేర్లు ఉన్నాయనడం అవాస్తవం అని కేపీఎస్ మల్హోత్రా స్పష్టం చేశారు. సారా అలీ ఖాన్ పేర్లు ఈ జాబితాలో లేవు. బాలీవుడ్ ప్రముఖులెవ్వరీకి కూడా సమన్లు జారీ చేయడం లేదని ఆయన వెల్లడించారు. కాగా, ఇటీవల రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.
Smashed to the stands, posed for the camera! ?#HallaBol | #RoyalsFamily | @shashank2191 pic.twitter.com/2BTKMGFGGR
— Rajasthan Royals (@rajasthanroyals) September 12, 2020