పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు

జమ్ము కాశ్మీర్‌ పుల్వామా జిల్లా అవంతిపొరాలో జరిగిన ఉగ్రదాడి పట్ల దేశం యావత్తూ ఆగ్రహావేశాల్లో ఊగిపోయింది. అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కాశ్మీర్‌లో పెద్ద సంఖ్యలో యువత నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 44 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను హతమార్చడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని… ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని జమ్ము యువత డిమాండ్ చేశారు. భోపాల్‌లో బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ […]

పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు

Edited By:

Updated on: Mar 07, 2019 | 8:23 PM

జమ్ము కాశ్మీర్‌ పుల్వామా జిల్లా అవంతిపొరాలో జరిగిన ఉగ్రదాడి పట్ల దేశం యావత్తూ ఆగ్రహావేశాల్లో ఊగిపోయింది. అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కాశ్మీర్‌లో పెద్ద సంఖ్యలో యువత నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 44 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను హతమార్చడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని… ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని జమ్ము యువత డిమాండ్ చేశారు. భోపాల్‌లో బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.