AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైంగిక దాడి కేసులో ఆశారాం తనయుడికి జీవిత ఖైదు

లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్‌ సాయికి సూరత్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గ‌త శుక్ర‌వారం ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించిన విష‌యం తెలిసిందే. సూరత్‌లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై నారాయణ్‌ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్‌ కోర్టు ధ్రువీకరించింది. ఢిల్లీలో 2013 డిసెంబ‌ర్‌లో అరెస్టయిన సాయి అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో గంగా, జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను […]

లైంగిక దాడి కేసులో ఆశారాం తనయుడికి జీవిత ఖైదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 30, 2019 | 6:32 PM

Share

లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్‌ సాయికి సూరత్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గ‌త శుక్ర‌వారం ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించిన విష‌యం తెలిసిందే. సూరత్‌లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై నారాయణ్‌ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్‌ కోర్టు ధ్రువీకరించింది. ఢిల్లీలో 2013 డిసెంబ‌ర్‌లో అరెస్టయిన సాయి అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నారు.

ఈ కేసులో గంగా, జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా తేల్చింది. ఆశ్ర‌మంలో ప‌నిచేసిన ఓ భ‌క్తురాలు ఫిర్యాదు మేర‌కు 2013లో నమోదైన ఈ కేసులో ఆరేండ్ల తర్వాత నారాయణ్‌పై అభియోగాలు రుజువు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దోషులకు ఇవాళ శిక్ష ఖ‌రారు చేశారు. ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us