ఇది మన పెళ్లి రోజు..సదా నీ ప్రేమలో..లోకేశ్

మాజీ మంత్రి లోకేశ్‌, బ్రాహ్మణి  దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా  భార్యపై తనకున్న ప్రేమను ట్విటర్‌ ద్వారా తెలియజేశారు నారా లోకేశ్. కాస్త డిఫరెంట్ వేలో వైఫ్‌ను మెస్మరైజ్‌ చేసే ప్రయత్నం చేశారు. ‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ […]

ఇది మన పెళ్లి రోజు..సదా నీ ప్రేమలో..లోకేశ్
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2019 | 3:48 PM

మాజీ మంత్రి లోకేశ్‌, బ్రాహ్మణి  దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా  భార్యపై తనకున్న ప్రేమను ట్విటర్‌ ద్వారా తెలియజేశారు నారా లోకేశ్. కాస్త డిఫరెంట్ వేలో వైఫ్‌ను మెస్మరైజ్‌ చేసే ప్రయత్నం చేశారు.

‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన టీడీపీ కార్యకర్తలు, పలువురు నెటిజన్లు దంపతులకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్, ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మణిల వివాహం 2007 ఆగస్టు 26న జరిగింది. కాగా నారా బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.