‘ఇదిగో సాక్ష్యం..’ మంత్రి జయరామే ఒప్పుకున్నారు: లోకేష్

|

Oct 08, 2020 | 12:07 PM

ఆంధ్రప్రదేశ్ కార్మికమంత్రి గుమ్మనూరు జయరాంపై ఏపీ టీడీపీ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. దాదాపు వారం రోజులుగా టీడీపీ సీనియర్లందరూ జయరాం భూదందా, ఈఎస్ఐ స్కాం వంటి ఆరోపణలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ‘టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్’ వీడియో పోస్ట్ చేస్తూ.. ఇదిగో సాక్ష్యం జయరామే స్వయంగా ఒప్పుకున్నారంటూ టీవీ9 వీడియో ఉంచి ట్వీట్టర్లో కామెంట్లు చేశారు. ‘ఈఎస్ఐ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు గారిని […]

ఇదిగో సాక్ష్యం.. మంత్రి జయరామే ఒప్పుకున్నారు: లోకేష్
Follow us on

ఆంధ్రప్రదేశ్ కార్మికమంత్రి గుమ్మనూరు జయరాంపై ఏపీ టీడీపీ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. దాదాపు వారం రోజులుగా టీడీపీ సీనియర్లందరూ జయరాం భూదందా, ఈఎస్ఐ స్కాం వంటి ఆరోపణలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ‘టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్’ వీడియో పోస్ట్ చేస్తూ.. ఇదిగో సాక్ష్యం జయరామే స్వయంగా ఒప్పుకున్నారంటూ టీవీ9 వీడియో ఉంచి ట్వీట్టర్లో కామెంట్లు చేశారు.

‘ఈఎస్ఐ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా.. అని అంగీకరించారు’. ‘బెంజ్ మంత్రి గారి పేకాట మాఫియా, ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టాం. మరి చర్యలెక్కడ వైఎస్ జగన్ గారూ..’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించే ప్రయత్నం చేశారు లోకేష్.