Balayya Boyapati Movie: బోయపాటికి బాలయ్య అభిమానుల స్పెషల్ రిక్వెస్ట్..ఇలా చేస్తున్నారేంటని ఆవేదన !

|

Jan 03, 2021 | 9:33 PM

స్పెషల్ లుక్కులు, మోషన్ పోస్టర్లు అంటూ జనవరి ఫస్ట్‌కి.. టాలీవుడ్ కార్నర్స్ అన్నీ మోత మోగిపోయాయి. కానీ.. నందమూరి క్యాంపు ఒక్కటే న్యూ ఇయర్ జోష్ లేక జావగారిపోయింది.

Balayya Boyapati Movie: బోయపాటికి బాలయ్య అభిమానుల స్పెషల్ రిక్వెస్ట్..ఇలా చేస్తున్నారేంటని ఆవేదన !
Follow us on

Balayya Boyapati Movie: స్పెషల్ లుక్కులు, మోషన్ పోస్టర్లు అంటూ జనవరి ఫస్ట్‌కి.. టాలీవుడ్ కార్నర్స్ అన్నీ మోత మోగిపోయాయి. కానీ.. నందమూరి క్యాంపు ఒక్కటే న్యూ ఇయర్ జోష్ లేక జావగారిపోయింది. తారక్ ఎలాగూ జక్కన్న క్యాంపులో ఇరుక్కుపోయారు. మరి.. బాలయ్యకేమైంది. బీబీ3 సినిమా క్యాంపు నుంచి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. . మినిమమ్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అయినా వస్తుందన్న అభిమానుల ఆశ అడియాశే అయింది. నిన్నమొన్న కమిటైన సినిమాలక్కూడా పాటలు రెడీ చేస్తున్న తమన్.. బాలయ్య సినిమాను మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదా అన్న టాక్ నడుస్తోంది.

బాలయ్య అప్కమింగ్ మూవీస్ మీద కూడా అంతకంతకూ క్లారిటీ మిస్సవుతోంది. సీనియర్ డైరెక్టర్లను పక్కకుపెట్టి.. న్యూ టాలెంట్ మీద ఫోకస్ చేశారని.. మూడు కథల్ని లైన్లో పెట్టారని వార్తలొస్తున్నా.. ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. బాలయ్యతో మల్టిస్టారర్ మూవీలో నటిస్తున్నారట కదా అని అడిగితే.. అదేమి లేదని కొట్టిపారేస్తున్నారు హీరో నాగశౌర్య.

ఇప్పుడు బోయపాటి చేస్తున్న హ్యాట్రిక్ మూవీలో బాలయ్యకు తోడుగా ఒక యంగ్‌స్టర్ రోల్ ఉందని, నవీవ్ చంద్ర పేరు ఫైనల్ అయిందని చెబుతున్నారు. ఇలా అవుట్‌సైడ్ నుంచి వినిపించే వార్తలే తప్ప బీబీ3 నుంచి రియల్ బజ్ మాత్రం మిస్ అవుతూనే వుంది. ఒక్క అనౌన్స్‌మెంట్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో లెజెండ్ డైరెక్టర్‌ని వేడుకుంటున్నారు బాలయ్య అభిమానులు.

Also Read :

LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్