Namaste Trump: “మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ”

|

Feb 24, 2020 | 2:36 PM

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటిస్తున్నారు.

Namaste Trump: మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ
Follow us on

Namaste Trump: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు హోదాలో ట్రంప్ మొదటిసారిగా కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు చేరుకున్న ట్రంప్‌కు.. లక్షల మంది ప్రజలు స్వాగతం పలికారు. నమస్తే ట్రంప్ అంటూ మోదీ స్పీచ్ ప్రారంభించారు. అప్పుడు హౌడీ మోదీ.. ఇప్పుడు నమస్తే ట్రంప్.. ఇది నవ చరిత్రకు శ్రీకారమని అభివర్ణించారు. అతిపెద్ద భారత ప్రజాస్వామ్యదేశం మీకు స్వాగతం పలుకుతుందని మోదీ అన్నారు.  భారత్ అమెరికా బంధం కలకాలం వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్న మోదీ డైలాగ్‌కు గ్రౌండ్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. భారత్, అమెరికాలు చాలా విషయాల్లో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయని తెలిపారు. కేవలం “గుజరాత్ మాత్రమే కాదు..యావత్ దేశం మొత్తం ట్రంప్‌కు స్వాగతం పలుకుతుంది” అని మోదీ పేర్కొన్నారు.

ఇండియా స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంలో ముఖ్య భూమిక  పోషించిన సబర్మతి నది ఒడ్డున ఉన్నారు.. ఎన్నో వైవిధ్యాలు కూడిన భారతానికి విచ్చేశారు.. విభిన్న భాషలు, విభిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, విభిన్న రుచులు, ఎన్నో మతాలకు నిలయమై భారతదేశం భిన్నత్వలో ఏకత్వంలో చాటుకుంటోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.