Mystery Disease: పెరుగుతోన్న వింత వ్యాధి బాధితుల సంఖ్య.. పొలాలకు ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్న రైతులు..

Mystery Disease In West Godavari: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఏలూరులో ప్రారంభమైన ఈ వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది...

Mystery Disease: పెరుగుతోన్న వింత వ్యాధి బాధితుల సంఖ్య.. పొలాలకు ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్న రైతులు..

Updated on: Jan 21, 2021 | 8:28 AM

Mystery Disease In West Godavari: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఏలూరులో ప్రారంభమైన ఈ వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది.
తాజాగా ఈ వింత వ్యాధి భీమడోలు మండలం, పూళ్ల, పరిసర గ్రామాలకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇక బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మూడు రోజుల్లో వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 34కు చేరింది. వింత వ్యాధి బారిన పడిన వారిలో ఫిట్స్, వాంతులు, నీరసంతో జనం కళ్లుతిరిగి పడిపోతున్నారు. కొంతమందిలో డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో ఉన్నట్టుండి రైతులు అకస్మాత్తుగా పడిపోతుండడంతో.. ఒంటరిగా పొలాలకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. ఇక వింత వ్యాధి గుట్టు విప్పడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నీటిని పరీక్షించడానికి ల్యాబ్‌కు పంపించారు. గురువారం శాంపిల్స్‌ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్‌ క్యాంపు, మందులు అందుబాటులో ఉంచారు.

Also Read: Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న ఆర్టీసీ బస్సు-లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు..