మయన్మార్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన సైన్యం.. సోషల్ మీడియాపై నిషేధం..!

మయన్మార్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాపౌ అంక్షలు విధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిషేధించింది.

మయన్మార్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన సైన్యం.. సోషల్ మీడియాపై నిషేధం..!

Updated on: Feb 06, 2021 | 10:31 PM

Myanmar blocks internet : మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాపౌ అంక్షలు విధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను పర్యవేక్షించే ‘నెట్‌బ్లాక్స్‌’ బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శనివారం ఉదయం నుంచి ఈ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవని వారు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేశామని చెప్పిన సైన్యం అదేవిధంగా ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, సామాజిక మాధ్యమాలను నిషేధించడంపై ఆయా కంపెనీలు స్పందించాయి. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. ఇంటర్నేట్ సేవలను నిలిపివేయడంపై స్పందించిన సంస్థలు.. మిలటరీ చర్య ప్రజల హక్కుల ఉల్లంఘనేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. దేశ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించింది. వారిపై వివిధ కేసులు పెట్టిన మిలటరీ.. దేశంపై మరింత పట్టు బిగిస్తోంది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) అవకతవకలకు పాల్పడిందనేది సైన్యం ఆరోపించింది. ఆరోపణలపై అధికార పార్టీ వ్యవహరించిన సరిగా లేదంటూ తిరుగుబాటు చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

Read Also…  దేశవ్యాప్తంగా వేగంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 50 లక్షల మార్కును దాటిన టీకా పంపిణీ