సభలో పరిణామాలతో రక్తం మరిగిపోతోంది.. స్పీకర్ రమేశ్‌కుమార్

| Edited By:

Jul 23, 2019 | 8:43 PM

ఉత్కంఠగా సాగిన కర్నాటక బలపరీక్ష ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభను నడిపించిన స్పీకర్ రమేశ్‌కుమర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. సభలో జరుగుతున్న పరిణామాలతో తన రక్త మరిగిపోతుందని వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా వచ్చిన స్పీకర్ పదవిని సక్రమంగా నిర్వహించాననే తృప్తి తనకు ఉందని, అయితే తాను రాజీనామా పత్రంలో సహా సభకు వచ్చానంటూ దాన్ని బీజేపీ సభ్యులకు చూపించారు. ఆ పత్రాన్ని ప్రతిపక్షనేత యడ్యూరప్పకు పంపారు స్పీకర్ రమేశ్‌కుమార్. తాను రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నిర్వహించానని ఆయన […]

సభలో పరిణామాలతో రక్తం మరిగిపోతోంది.. స్పీకర్ రమేశ్‌కుమార్
Follow us on

ఉత్కంఠగా సాగిన కర్నాటక బలపరీక్ష ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభను నడిపించిన స్పీకర్ రమేశ్‌కుమర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. సభలో జరుగుతున్న పరిణామాలతో తన రక్త మరిగిపోతుందని వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా వచ్చిన స్పీకర్ పదవిని సక్రమంగా నిర్వహించాననే తృప్తి తనకు ఉందని, అయితే తాను రాజీనామా పత్రంలో సహా సభకు వచ్చానంటూ దాన్ని బీజేపీ సభ్యులకు చూపించారు. ఆ పత్రాన్ని ప్రతిపక్షనేత యడ్యూరప్పకు పంపారు స్పీకర్ రమేశ్‌కుమార్. తాను రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నిర్వహించానని ఆయన తెలిపారు.