‘మసీదుల్లో ఆయుధాలు దాచిపెడుతున్న ముస్లిములు’..

|

Jan 22, 2020 | 2:45 PM

‘కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా  మసీదుల్లో ముస్లిములు కత్తులు, పొడవాటి ఖడ్గాలు,  సోడా బాటిళ్లను, ఇతర ఆయుధాలను దాచిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచల వ్యాఖ్యలు చేశారు.  వారు తమ ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చేసే బదులు.. ఇలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పైగా ఖాజీలు ‘ ప్రబోధాలు ‘ చేయకపోగా.. ఫత్వాలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దావణగెరె జిల్లా లోని హొన్నళ్లిలో సీఏఏకి అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన..ఈ ర్యాలీలో ముస్లిములు పాల్గొనకపోవడాన్ని తప్పు […]

మసీదుల్లో ఆయుధాలు దాచిపెడుతున్న ముస్లిములు..
Follow us on

‘కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా  మసీదుల్లో ముస్లిములు కత్తులు, పొడవాటి ఖడ్గాలు,  సోడా బాటిళ్లను, ఇతర ఆయుధాలను దాచిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచల వ్యాఖ్యలు చేశారు.  వారు తమ ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చేసే బదులు.. ఇలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పైగా ఖాజీలు ‘ ప్రబోధాలు ‘ చేయకపోగా.. ఫత్వాలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దావణగెరె జిల్లా లోని హొన్నళ్లిలో సీఏఏకి అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన..ఈ ర్యాలీలో ముస్లిములు పాల్గొనకపోవడాన్ని తప్పు పట్టారు. (గతంలో కర్నాటకలో బీజేపీ మంత్రిగా కూడా ఉన్న రేణుకాచార్య… ప్రస్తుతం సీఎం ఎదియూరప్ప కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు).

సీఏఏకి మద్దతునివ్వాలని తాను కోరినప్పటికీ ముస్లిములు ఇందుకు నిరాకరిస్తున్నారని రేణుకాచార్య పేర్కొన్నారు.’ నా నియోజకవర్గానికి కేటాయించిన నిధులను నేను హిందువుల సంక్షేమానికే కేటాయిస్తాను’ అని ఆయన ప్రకటించారు. అయితే రేణుకాచార్య ప్రకటతో తమ పార్టీకి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.ప్రకాష్ స్పష్టం చేశారు. అలాంటి ప్రకటనలకు తాము దూరమని, బహుశా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమై ఉండవచ్ఛునని అన్నారు. కానీ ఇదే పార్టీకి చెందిన మరో అధికార ప్రతినిధి మధుసూదన మాత్రం.. రేణుకాచార్య వ్యాఖ్యలను తాము సమీక్షిస్తామని, మసీదుల్లో ముస్లిములు నిజంగా ఆయుధాలు దాస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు.