మతం కాదు..మానవత్వం మేల్కొంది

|

May 13, 2019 | 3:09 PM

ముస్లింలకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెలలో వారు చాలా నిష్టతో ఉపవాస దీక్ష చేస్తారు. ఎంత ఇబ్బంది వచ్చినా.. ఉపవాస దీక్షను మాత్రం విరమించడానికి అంగీకరించరు. అయితే, తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను విరమించి మరీ రక్తదానం చేశాడో ముస్లిం యువకుడు. అసోంలోని మంగలోదోయ్‌లో ఈ ఘటన జరిగింది. పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తూ ఉంటాడు. అదే […]

మతం కాదు..మానవత్వం మేల్కొంది
Follow us on

ముస్లింలకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెలలో వారు చాలా నిష్టతో ఉపవాస దీక్ష చేస్తారు. ఎంత ఇబ్బంది వచ్చినా.. ఉపవాస దీక్షను మాత్రం విరమించడానికి అంగీకరించరు. అయితే, తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను విరమించి మరీ రక్తదానం చేశాడో ముస్లిం యువకుడు. అసోంలోని మంగలోదోయ్‌లో ఈ ఘటన జరిగింది. పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆస్పత్రిలో తన స్నేహితుడు తపోష్ గొగోయ్‌ అనారోగ్యంతో చేరాడు. తపోష్ గొగోయ్‌కి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకు బీ పాజిటివ్ బ్లడ్ అవసరం పడింది. ఆ సమయంలో ఆస్పత్రిలో బ్లడ్ అందుబాటులో లేదు. దీంతో వెంటనే పలావుల్లా అహ్మద్ ముందుకొచ్చాడు.

బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వైద్యులు తక్షణ శక్తి కోసం ఓ ఫ్రూటీనో, లేకపోతే జ్యూస్ అందిస్తారు. అయితే, రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా, పగటిపూట ఆహారం తీసుకోవడం నిషేధం. ఉపవాస దీక్షలో ఉన్న పలావుల్లా అహ్మద్ తన దీక్షకు ఇబ్బంది లేకుండా రక్తదానం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టే దీక్షను పక్కనపెట్టి తన మిత్రుడికి రక్తదానం చేశాడు.  పలావుల్లా అహ్మద్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మిత్రుడి కోసం అతడు చేసిన త్యాగాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే, తనను పొడగాల్సిన అవసరం ఏముందంటున్నాడు అహ్మద్. ‘మొదట జీవితం, ఆ తర్వాతే మతం, కులం’ అంటున్నాడు అహ్మద్.