ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న “లౌక్యం” హీరోయిన్..!

ముంబైలో భారీ వర్షాల కారణంగా విమాన సేవలు రద్దు చేశారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరాల్సిన రకుల్.. విమాన సర్వీసులు నిలిపివేయడంతో అక్కడే చిక్కుకుపోయారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇక దీనిపై ముంబై ఎయిర్‌పోర్టు తెరిచి ఉందో లేదో ఎవరైనా తెలియజేస్తారా అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రకుల్‌ […]

ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న లౌక్యం హీరోయిన్..!

Edited By:

Updated on: Jul 02, 2019 | 2:02 PM

ముంబైలో భారీ వర్షాల కారణంగా విమాన సేవలు రద్దు చేశారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరాల్సిన రకుల్.. విమాన సర్వీసులు నిలిపివేయడంతో అక్కడే చిక్కుకుపోయారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇక దీనిపై ముంబై ఎయిర్‌పోర్టు తెరిచి ఉందో లేదో ఎవరైనా తెలియజేస్తారా అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు రకుల్‌ స్పందిస్తూ.. సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా ఎయిర్‌పోర్ట్‌ నుంచి కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయాను అని సమాధానమిచ్చారు. మరోవైపు ఈ నెల ఐదో తేదీ వరకు ముంబయిలో అతిభారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.