Watch Video: హెల్మెట్‌ ధరించి బంగారం షాపులోకి చొరబడ్డ దుండగులు.. గన్‌తో బెదిరించి నగలతో పరార్‌! వీడియో

ముసుగులు ధరించిన ముగ్గురు అగంతకులు నగల దుకాణంలోకి చొరబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న గన్నులతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నగల దుకాణంలోని సిబ్బందిని బెదిరించి సుమారు రూ.11 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో ఆదివారం (జులై 28) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Watch Video: హెల్మెట్‌ ధరించి బంగారం షాపులోకి చొరబడ్డ దుండగులు.. గన్‌తో బెదిరించి నగలతో పరార్‌! వీడియో
Mumbai Jewellery Shop Robbery

Updated on: Jul 29, 2024 | 6:28 PM

ముంబై, జులై 29: ముసుగులు ధరించిన ముగ్గురు అగంతకులు నగల దుకాణంలోకి చొరబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న గన్నులతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నగల దుకాణంలోని సిబ్బందిని బెదిరించి సుమారు రూ.11 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో ఆదివారం (జులై 28) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నవీ ముంబైలోని ఖర్ఘర్‌ ప్రాంతంలో గల ఓ నగల దుకాణంలోకి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు తలలకు హెల్మెట్‌లు ధరించి చొరబడ్డారు. నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులతో, చేతిలో తుపాకులతో దుకాణంలోకి హఠాత్తుగా వచ్చారు. షాపు సిబ్బందిని బెదిరించడానికి దుండగులు తమ చేతుల్లోని తుపాకులతో గాల్లోకి నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఎవరినీ గాయపరచడలేదు. అనంతరం గన్నుతో అక్కడున్న సిబ్బందిని బెదిరించి సుమారు రూ.11.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. చోరీ అనంతరం ముగ్గురు వ్యక్తులు బయటకు వెళ్లి, తమతో తెచ్చుకున్న మోటారుసైకిల్‌పై పారిపోయారు. వారు బయటికి వెళ్లగానే షాపు సిబ్బంది బయటకు పరుగులు తీసి, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అదే షాపులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఘటనపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఖర్ఘర్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగల దుకాణంలో దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.