ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు బాలల మృతి

ములుగు జిల్లాలో ఈత సరదా ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో గర్భశోకాన్ని మిగిల్చింది. ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. లాక్ డౌన్ తోపాటు వేసవికాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి చెరువులో ఈతకి వెళ్లారు. పూడిక తీసిన గుంతలోపడి ఇద్దరుబాలురు మృతిచెందారు. మృతులు మండలరేశ్వంత్ (12), ముచ్చపోతులవీరేందర్ (12)గా గుర్తించారు. అప్పటివరకూ అడుతూ పాడుతూ కనిపించిన పిల్లలు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాధ చాయాలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు […]

ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు బాలల మృతి

Edited By:

Updated on: Sep 01, 2020 | 7:40 PM

ములుగు జిల్లాలో ఈత సరదా ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో గర్భశోకాన్ని మిగిల్చింది. ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. లాక్ డౌన్ తోపాటు వేసవికాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి చెరువులో ఈతకి వెళ్లారు. పూడిక తీసిన గుంతలోపడి ఇద్దరుబాలురు మృతిచెందారు. మృతులు మండలరేశ్వంత్ (12), ముచ్చపోతులవీరేందర్ (12)గా గుర్తించారు. అప్పటివరకూ అడుతూ పాడుతూ కనిపించిన పిల్లలు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాధ చాయాలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.