భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ రిలయన్స్ మాత్రమే.
ప్రపంచ ఐదో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన మరుసటి రోజే ఈ రికార్డు సొంతమైంది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రపంచంలోని అత్యంత విలువైన 50 కంపెనీల్లో చోటు దక్కించుకుంది. చమురు కంపెనీలు మొదలుకుని టెలీకాం సేవల దాకా విస్తరించిన ఆర్ఐఎల్… ఇప్పటికే రూ.13 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన తొలి కంపెనీగా అవతరించింది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో 48వ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా, అంతర్జాతీయంగా సౌదీ ఆరామ్‌కో 1.7 ట్రిలియన్ డాలర్లతో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగివుండగా.. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ తదితర సంస్థలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ షేరు గురువారం 2.82 శాతం బలపడి రూ. 2,060.65 వద్ద ముగిసింది. దీంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లకు పైకి చేరుకుంది.
Day after Mukesh Ambani becomes 5th richest globally, Reliance enters 50 most valued companies list#MukeshAmbani #Reliancehttps://t.co/eWjcjDX5Kn
— India TV (@indiatvnews) July 23, 2020