ఐపీఎల్ ఊపిరి పీల్చుకో.. ధోని వస్తున్నాడు..!

ధోని విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫార్మాట్ ఏదైనా కూడా ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ క్రీజ్‌లో ఉన్నాడంటే బౌలర్లకు దబిడి దిబిడే.

ఐపీఎల్ ఊపిరి పీల్చుకో.. ధోని వస్తున్నాడు..!

Updated on: Aug 17, 2020 | 6:52 PM

Dhoni In IPL 2020: ధోని విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫార్మాట్ ఏదైనా కూడా ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ క్రీజ్‌లో ఉన్నాడంటే బౌలర్లకు దబిడి దిబిడే. అయితే తాజాగా ఆగష్టు 15వ తేదీని మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ధోని చెలరేగిపోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

”ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని విజృంభించే అవకాశం ఖచ్చితంగా ఉంది. బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి” అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. అటు ధోని ఫ్యాన్స్ కూడా ఐపీఎల్‌లో తన ఆటతో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్ వచ్చే నెల 19వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. పూర్తి ‘బయో సెక్యూర్ బబుల్’లో ఈ లీగ్ జరగనుంది. ఆటగాళ్లందరికీ ఐదు రోజులకు ఒకసారి కరోనా టెస్టులు చేస్తారు.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..