IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఖాతాలో సరికొత్త రికార్డును నమోదు చేసుకోనున్నాడు. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో.. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డుల్లోకి ఎక్కుతాడు. ధోని తర్వాత 193 మ్యాచ్‌లతో సురేష్ రైనా రెండో స్థానంలో ఉండగా.. ముంబై కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(192) మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(185), విరాట్ కోహ్లీ(180), రాబిన్ ఉతప్ప(180), యూసఫ్ పఠాన్(174), రవీంద్ర జడేజా(173) ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ ధోనిసేనకు కఠిన పరీక్ష అని చెప్పాలి. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read: IPL 2020 CSK Vs SRH Live Cricket Score: ధోని, వార్నర్‌లలో ఎవరిది పైచేయి.!
MS Dhoni today becomes the most capped player (194) in the history of IPL.#Dream11IPL pic.twitter.com/PwpDFcEA2E
— IndianPremierLeague (@IPL) October 2, 2020