Rowan Atkinson : మిస్టర్‌ బీన్‌ మరణించాడంటూ మళ్లీ పుకార్లు.. ఆయన ఏటా ఎలా చనిపోతారని తిప్పికొట్టిన అభిమానులు..

ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం స్లాప్​స్టిక్​ కామెడీతో తన మైమ్​ యాక్టింగ్​తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు...

Rowan Atkinson : మిస్టర్‌ బీన్‌ మరణించాడంటూ మళ్లీ పుకార్లు.. ఆయన ఏటా ఎలా చనిపోతారని తిప్పికొట్టిన అభిమానులు..

Updated on: Nov 23, 2021 | 6:19 PM

ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం స్లాప్​స్టిక్​ కామెడీతో తన మైమ్​ యాక్టింగ్​తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు బ్రిటిష్‌ నటుడు రోవాన్​అట్కిన్సన్​. తన అద్భుతమైన నటనతో ‘మిస్టర్​ బీన్’ ​పాత్రను ఒక ఐకానిక్​ క్యారెక్టర్‌గా తీర్చిదిద్దిన ఆయన అభిమానుల మదిలో ‘నవ్వుల రారాజు’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి మిస్టర్‌ బీన్‌​మరణించాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం కూడా రోవాన్‌ చనిపోయారంటూ ట్విట్టర్‌లో సందేశాలు వెల్లువెత్తాయి. అయితే ఎప్పటిలాగే అది కూడా అబద్ధమని తేలింది.

గత కొన్నేళ్లుగా..
అమెరికాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ‘ బ్రేకింగ్‌ న్యూస్‌.. 58 ఏళ్ల వయసులో మిస్టర్‌ బీన్‌ కారు ప్రమాదంలో చనిపోయారు’ అని ఓ వార్త సర్క్యులేట్‌ కాగా.. ఇదే వార్త మరో ప్రముఖ ట్విట్టర్‌ హ్యాండిల్‌లోనూ కనిపించడంతో చాలామంది అభిమానులు కంగారు పడ్డారు. అయితే కొద్ది సేపటికే అవన్నీ పుకార్లని తేలిపోయింది. 66 ఏళ్ల రోవాన్​ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఈ ఏడాది మేలో కూడా ఆయన మరణించారంటూ ఫేక్‌ వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. ఇలా ఏటా అసత్యపు వార్తలు రావడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రొవాన్‌ అట్కిన్సన్ ప్రతి సంవత్సరం ఎందుకు చనిపోతాడు?’, ‘మా నవ్వుల రారాజు  నిక్షేపంగా ఉన్నారు’  అని మిస్టర్‌ బీన్‌ ఫ్యాన్స్  పోస్టులు పెడుతున్నారు.

Shahid Kapoor’s ‘Jersey’ : మరోసారి నటనతో కట్టిపడేసిన షాహిద్.. “జెర్సీ” ట్రైలర్

Naga Chaitanya : “థాంక్యూ” సినిమా నుంచి అక్కినేని నాగచైతన్య ఫస్ట్ లుక్.. అదుర్స్..

Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..

Loading...
Unable to load recommendations.
Follow Us