4,200 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 4,200 మంది పోలీస్ కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమైంది.

4,200 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!

Edited By:

Updated on: Jun 27, 2020 | 11:58 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 4,200 మంది పోలీస్ కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు ఆదేశాలు అందినట్టు పౌర సంబంధాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 4269 మంది కానిస్టేబుళ్లను సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టాలంటూ డీజీపీ వివేక్ జోహ్రీని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశించినట్టు సమాచారం.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి ఈ మేరకు ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 విధుల్లో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసుల కోసం ఆర్మీ ఆస్పత్రుల మాదిరిగానే పోలీస్ శాఖ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయాలంటూ అధికారులు చేసిన ప్రతిపాదనకు కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్‌డౌన్..