24 గంటల్లో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు

|

Sep 21, 2020 | 7:40 PM

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.  ఇక కర్నాటకలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతి రోజు ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్ యాక్టివ్ కేసులు...

24 గంటల్లో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు
Follow us on

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.  ఇక కర్నాటకలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతి రోజు ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష వరకు ఉండగా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు, మరణాలు 8 వేలు దాటాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.122 మంది కరోనా రోగులు మరణించారు.

దీంతో కర్నాటక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,26,876కు, మరణాల సంఖ్య 8,145కు చేరింది. గత 24 గంటల్లో 9,925 మంది కోలుకుని  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కర్నాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,377కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం 95,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.