వానలు వచ్చేస్తున్నాయోచ్..!

| Edited By:

Jun 21, 2019 | 11:32 AM

రాష్ట్రానికి నైరుతి పవనాలు శుక్ర, శనివారాల్లో రానున్నాయి. రుతుపవనాలు కొంత బలహీనంగా కదులుతున్నాయని ఆర్టీజీఎస్ ఆవేర్ నిపుణులు గురువారం తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షం కురియవచ్చు. రుతుపవనాల రాక కారణంగా రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక […]

వానలు వచ్చేస్తున్నాయోచ్..!
Follow us on

రాష్ట్రానికి నైరుతి పవనాలు శుక్ర, శనివారాల్లో రానున్నాయి. రుతుపవనాలు కొంత బలహీనంగా కదులుతున్నాయని ఆర్టీజీఎస్ ఆవేర్ నిపుణులు గురువారం తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షం కురియవచ్చు. రుతుపవనాల రాక కారణంగా రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నాయి. అత్యధికంగా 40 లేదా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.