బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రురల్, భద్రాద్రి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.