రుణగ్రహీతలకు బ్యాంకులు విధించిన వడ్డీపై కేంద్రం గుడ్ న్యూస్

|

Oct 03, 2020 | 1:53 PM

కరోనా కష్టకాలంలో వ్యక్తిగత, ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనాన్ని ఇచ్చే మాట చెప్పింది. లాక్ డౌన్ మారిటోరియం సమయంలో విధించిన ఆరు నెలల వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మార్చి, ఆగష్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి సైతం ఈ లబ్ధి అందనుంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ […]

రుణగ్రహీతలకు బ్యాంకులు విధించిన వడ్డీపై కేంద్రం గుడ్ న్యూస్
Follow us on

కరోనా కష్టకాలంలో వ్యక్తిగత, ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనాన్ని ఇచ్చే మాట చెప్పింది. లాక్ డౌన్ మారిటోరియం సమయంలో విధించిన ఆరు నెలల వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మార్చి, ఆగష్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి సైతం ఈ లబ్ధి అందనుంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన సదరు అఫిడవిట్‌లో తెలిపింది. తాము తీసుకున్న నిర్ణయం వల్ల రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఇ, వ్యక్తిగత రుణాలతో పాటు విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేసింది.