వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఇంటర్నెట్ ధరలు..!

| Edited By:

Mar 11, 2020 | 10:52 PM

భారతీయ మొబైల్ వినియోగదారులు గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటా రేట్లను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇది త్వరలోనే ముగియనుంది. భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్‌ బిల్లుల మోత

వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఇంటర్నెట్ ధరలు..!
Follow us on

Mobile internet: భారతీయ మొబైల్ వినియోగదారులు గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటా రేట్లను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇది త్వరలోనే ముగియనుంది. భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్‌ బిల్లుల మోత మోగనుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి.

అయితే.. మొబైల్ ఆపరేటర్లు ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే.. మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. భారత మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్నారు. మరోవైపు.. ట్రాయ్ సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది.

కాగా.. ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్‌ సంక్షోభం​,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని, ఇది తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది.