మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన కార్పొరేటర్…ప్ర‌జ‌ల ప్రశంస‌లు..

మంగుళూరులోని ఓ బీజేపీ కార్పోరేట‌ర్ ను ఇప్పుడు ప్ర‌జ‌లు తెగ ప్ర‌శంశిస్తున్నారు. ఆయ‌న చేసిన ప‌నేంటో తెలిస్తే మీరు కూడా స‌ద‌రు కార్పోరేట‌ర్ ను ప్రైజ్ చేయకుండా ఉండ‌రు.

మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన కార్పొరేటర్...ప్ర‌జ‌ల ప్రశంస‌లు..

Updated on: Jun 25, 2020 | 5:45 PM

మంగుళూరులోని ఓ బీజేపీ కార్పోరేట‌ర్ ను ఇప్పుడు ప్ర‌జ‌లు తెగ ప్ర‌శంశిస్తున్నారు. ఆయ‌న చేసిన ప‌నేంటో తెలిస్తే మీరు కూడా స‌ద‌రు కార్పోరేట‌ర్ ను ప్రైజ్ చేయకుండా ఉండ‌రు.

వివరాల్లోకి వెళితే.. మంగళూరు న‌గ‌ర‌ కార్పొరేషన్ పరిధిలోని కద్రీ-కంబాలా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ స్ట్ర‌క్ అయి మురుగునీరు విప‌రీతంగా రోడ్ల‌పై ప్ర‌వ‌హించింది. దీంతో ఆ ప్రాంతంలో నివ‌శించే ప్ర‌జ‌లు, అటుగా వెళ్లే వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విష‌యం లోక‌ల్ కార్పొరేటర్ మనోహర్ శెట్టికి తెలియ‌డంతో వెంట‌నే అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ద‌ కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. కానీ ప్ర‌స్తుతం వాన‌లు ప‌డుతోన్న‌ సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోనికి దిగ‌టానికి వారు నిరాకరించారు. అనంతరం మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ తో నగర కార్పొరేషన్‌ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి తానే న‌డుం బిగించారు కార్పొరేటర్ మనోహర్ శెట్టి. మ్యాన్‌హోల్‌లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన వ్య‌ర్థాల‌ను తొలగించారు. స్వ‌యంగా కార్పేరేట‌ర్ మ్యాన్‌హోల్‌లోకి దిగ‌డంతో ప‌క్క‌నే ఉన్న నలుగ‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న్ను అనుస‌రించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉండ‌టంతో ..టార్చ్ లైట్లు వేసి లోప‌ల చెత్త‌ను శుభ్రం చేశారు.

Follow Us